తాడిపత్రి పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీకి చెందిన దూదేకుల లాలెప్ప అనే వ్యక్తిని సోమవారం అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 34 మద్యం బాటిళ్లు, 5 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సిఐ చిన్న పెద్దయ్య తెలిపారు. స్థానిక రూరల్ పోలీసుస్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ మాట్లాడుతూ దూదేకుల లాలెప్ప అక్రమంగా మద్యం, నాటుసారా నిల్వ వుంచాడన్న సమాచారం మేరకు దాడులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి మద్యం బాటిళ్లు, నాటుసారా స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు సిఐ తెలిపారు.