మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన వడాలి కృష్ణకుమారి (25) అనే వివాహిత కనిపించడం లేదంటూ ఆమె తండ్రి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం దాసరిపాలెం గ్రామానికి చెందిన కృష్ణ కుమారికి పెద్దవడ్లపూడికి చెందిన మురళీ కృష్ణతో 10 సంవత్సరాల క్రితం వివాహమైంది. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలో ఈనెల 7వ తేదీన పెద్దవడ్లపూడి లోని తన భర్త నివాసం నుండి కృష్ణకుమారి వెళ్లి తిరిగిరాలేదని ఆమె తండ్రి శ్రీనివాసరావు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఫోటోలోని మహిళ ఆచూకీ తెలిస్తే మంగళగిరి రూరల్ పోలీసులకు లేదా డయల్ 100 కు సమాచారం అందజేయాలని కోరారు.