ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో వివాహిత రాసలీలలు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 02:03 PM

ఆమెకు పెళ్లి అయింది. భర్తతో చక్కగా సంసారం చేసుకుంటోంది. అయితే భర్త బయటకెళ్లి, కష్టపడి సంపాదిస్తుండగా ఆమె వక్రమార్గం పట్టింది. తన ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారం అనుకోకుండా భర్త కంటపడింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త తన భార్యకు, ఆమె ప్రియుడికి ఊహించని శిక్ష వేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజ్‌ఘర్ ప్రాంతంలో ఓ ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా జీవిస్తున్నారు. భార్య సంతోషం కోసం ఆ భర్త రోజూ బాగా కష్టపడేవాడు. అయితే ఇటీవల ఏ మాత్రం ఊహించని దృశ్యం కంటపడింది. తన భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. భార్యను, ఆమె ప్రియుడి భాగోతాన్ని ఊరందరికీ తెలియజేయాలనుకున్నాడు. వారిద్దరినీ ఊర్లోకి తీసుకొచ్చి, చెట్టుకు కట్టేశాడు. రెండు గంటల పాటు ఆగకుండా కొట్టాడు.


వీరి అరుపులు విన్న స్థానికులు పరుగుపరుగున వచ్చారు. జరిగిందంతా తెలుసుకుని సదరు వివాహితనే అంతా తిట్టిపోశారు. చక్కగా చూసుకునే భర్త ఉండగా ఇదేం పాడు పని అని మొహం మీదే తిట్టారు. ఈ క్రమంలో కొందరు ఆ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సదరు వ్యక్తిని స్టేషన్‌కు పిలిచి చీవాట్లు పెట్టారు. దీంతో పాటు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు సదరు భర్తపై కేసు పెట్టారు. మరోవైపు భార్యాభర్తలిద్దరినీ ఒక్కటి చేసేందుకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com