కుమార్తెని కొట్టినందుకు మామ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినందుకు అల్లుడు మామపై దాడి చేసి సంఘటన జరిగింది. వివరాల ప్రకారం తాడిగడప గ్రామానికి చెందిన బొడ్డు వెంకటేశ్వరరావు అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. అతడి కుమార్తె బొమ్మిడి కృపను మంగళవారం భర్త రంగా కొట్టాడు. దీంతో కృప తన తండ్రి వెంకటేశ్వరరావుకి చెప్పడంతో తండ్రి కూతూళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తావా అంటూ మామ వెంకటేశ్వరరావుపై దాడి చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.