ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర కొరియాపై యుధ్ధం ప్రకటించలేదన్న అమెరికా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2017, 11:07 AM

ఉత్తర కొరియా, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సంగతి తెలిసిందే. ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కొరియాపై యుద్ధం ప్రకటించామనే వార్తల్లో నిజం లేదంటూ అమెరికా తెలిపింది. ఈ ప్రచారం అసంబద్ధమని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి శారా శాండర్స్ చెప్పారు. కొరియా అణు కార్యక్రమాలను నిలువరించడంపైనే అమెరికా దృష్టిని సారించిందని తెలిపారు. ఆర్థిక, దౌత్యపరమైన చర్యల ద్వారానే తాము ముందుకు వెళుతుతున్నామని చెప్పారు. మరోవైపు ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హొ మాట్లాడుతూ, తమపై అమెరికా యుద్ధం ప్రకటించిన విషయం ప్రపంచానికంతా తెలుసని అన్నారు. అమెరికాకు ఉత్తర కొరియా దీటుగా సమాధానమిస్తుందని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com