ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్రో ఉద్యోగులకు పిజ్జా హట్‌ ఆఫర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 22, 2017, 07:14 AM

104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సృష్టించిన రికార్డును ప్రపంచదేశాలు కొనియాడాయి. ఇస్రో సాధించిన ఘనతను కీర్తిస్తూ పిజ్జా హట్‌ ఇస్రో ఉద్యోగులకు ఉచితంగా పిజ్జా ఆఫర్‌ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న పిజ్జా హట్‌లో ప్రత్యేకంగా ఇస్రో ఉద్యోగులకు పిజ్జాలు ఇస్తున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. దాదాపు 2000 మంది ఇస్రో ఉద్యోగులకు ఆరు లక్షల విలువ చేసే పిజ్జాలను పంపిణీ చేసింది. కొన్ని షరతులు, నిబంధనలతో ఈ ఆఫర్‌ను ప్రకటించినప్పటికీ నెటిజన్లు ట్విటర్‌ ద్వారా పిజ్జా హట్‌ నిర్ణయాన్ని అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com