కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్ లో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరిందని ఇంగ్లాండ్ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ బ్రిటన్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గమనించామని అన్నారు. ఇప్పటికే 336 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు.ఈ పరిస్థితుల్లో తాజాగా నైజిరియా ను రెడ్ లిస్ట్ లో చేర్చడం సహా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. ప్రధానంగా ఇంగ్లాండ్ కు వచ్చేవారు కనీసం 48 గంటల ముందు కొవిడ్ పరీక్ష చేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు. ఈ మేరకు బ్రిటన్ పార్లమెంట్ లో ఆయన వివరించారు. మరోవైపు. ప్రస్తుతం UKలో డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోందని. నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న నెలరోజుల్లో బ్రిటన్ లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు తీవ్రస్థాయిలో పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.