ట్రెండింగ్
Epaper    English    தமிழ்

376 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 01, 2021, 01:01 PM

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీస్ విభాగం కాంట్రాక్టు పద్ధతిలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 376


ఇందులో సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులు326, ఈ-వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులు 50 ఉన్నాయి.


- సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు నవంబర్ 1, 2021 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


- ఈ-వెల్త్ రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. సంబంధిత పనిలో ఏడాదిన్నర పని అనుభవం ఉండాలి. వయసు నవంబర్ 1, 2021 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.


ఎంపిక విధానం- షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్/ ఇతర పద్ధతుల్లో ఉంటుంది.


దరఖాస్తు విధానం: ఆన్ లైన్


దరఖాస్తు ఫీజు: ఇతరులు (జనరల్/ఓబీసీ) - రూ.600


ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ/మహిళలకు రూ,100


దరఖాస్తులకు లాస్ట్ డేట్: 09.12.2021


వెబ్ సైట్: https://www.bankofbaroda.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com