ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెప్టెంబర్ 24న సౌతాఫ్రికాలో బతుకమ్మ వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 26, 2017, 12:01 PM

హైదరాబాద్ : తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ ఖండాంతరాలు దాటింది. విదేశాల్లో బతుకమ్మ పండుగను అట్టహాసంగా జరిపేందుకు నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నారు. సౌతాఫ్రికాలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా(టాసా) ఏర్పాట్లు ముమ్మరం చేసింది.


సెప్టెంబర్ 24, 2017న గౌటెంగ్ హాఫవే గార్డెన్స్‌కు సమీపంలోని మిద్రాండ్ హైస్కూల్ వేదికగా బతుకమ్మ పండుగను జరుపుకోనున్నట్లు టాసా ప్రతినిధులు ప్రకటించారు. టాసా ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి. ప్రకాశ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరుకానున్నారు. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టాసా ప్రతినిధులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com