ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బేషరతుగా ఉత్తర కొరియాతో భేటీ : అమెరికా

international |  Suryaa Desk  | Published : Fri, Oct 22, 2021, 09:35 AM

ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఉత్తర కొరియాతో భేటీ అవడానికి అమెరికా ముందుకొచ్చింది. ప్యాంగాంగ్‌తో తలపడాలని అమెరికా అనుకోవడం లేదని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ రాయబారి థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. ఉత్తర కొరియా తాజాగా క్షిపణిని ప్రయోగించడంపై భద్రతా మండలి బుధవారం సమావేశమైంది. అమెరికా తమ పట్ల ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్నదని ఉత్తర కొరియా ఆరోపిస్తున్నది. ఆత్మ రక్షణ కోసం ఆయుధాలను అభివృద్ధిచేసుకునే హక్కు తమకు వుందని పేర్కొన్నది. భద్రతా మండలి తీర్మానాలకు ఉత్తర కొరియా కట్టుబడి వుండాలని, కొరియా ద్వీపకల్పాన్ని పూర్తిగా అణు నిరాయుధీకరణ చేసే లక్ష్యం దిశగా నిలకడగా చర్చలు జరపాల్సిన సమయం ఆసన్నమైందని గ్రీన్‌ఫీల్డ్‌ విలేకర్లకు తెలిపారు.


2006 నుండి ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది. ప్యాంగాంగ్‌ అనుసరిస్తున్న బాలిస్టిక్‌ క్షిపణి కార్యక్రమానికి నిధుల్లో కోత పెట్టేందుకు ఈ ఆంక్షలను క్రమంగా పెంచుతూ వచ్చారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా డిపిఆర్‌కె అధికారులను కలుసుకోవడానికి మేం సిద్ధంగా వున్నామని గ్రీన్‌ఫీల్డ్‌ చెప్పారు. కాగా, దీనిపై ఉత్తర కొరియా వెంటనే స్పందించలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com