ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవ్యాంధ్రలో చేనేతకు చేయూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 21, 2017, 11:01 PM

 -త్వరలో చేనేత బజార్లు, క్లస్టర్ల ఏర్పాటు


 -అదనంగా 25 వేల నేత కార్మికులకు పింఛన్లు


 -నెలాఖరులోగా రుణ మాఫీ అమలుకు నిర్ణయం 


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి :  చేనేత రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే చేనేత కార్మికుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. వాటితో మరిన్ని పథకాలు అమలు చేసి, చేనేత కార్మికలను ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. దానిలో భాగంగా చేనేత ఉత్పత్తులను  అమ్మకాలు చేసుకునేందుకు వీలుగా చేనేత బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొసైటీలో ఆన్‌ లైన్‌ ద్వారా చెల్లింపులు చెల్లిస్తోంది. నేత కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని గమనించిన ప్రభుత్వం, క్లస్టర్లను విరివిగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. రాష్ట్రంలో లక్ష మంది చేనేత కార్మికులకు పింఛన్ల అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే 75 వేల మంది పెన్షన్లు అందిస్తోంది. మరో 25 వేల మంది పింఛన్లు అందించేలా ఏర్పాటు చేస్తోంది. చేనేత కార్మికులకు మెరుగైన సేవలు అందించేందుకు చేనేత అడ్వయిజరీ  బోర్డు ఏర్పాటుకు నిర్ణయించింది. నేత మగ్గాల నుంచి పవర్‌ లూమ్‌ లోకి  మారాలనుకునే చేనేత కార్మికులకు అనుమతులు జారీ చేయనున్నారు.  చేనేత రంగంలో సాంకేతికతతో పాటు  ఫ్యాషన్‌  డిజైన్‌ ను  వినియోగించేలా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం పథకం అమలుకు రూ.23.42 కోట్లు అంచనా వేసింది. ఇందులో కార్మికుల ఆరోగ్య బీమా కోసం రూ. 9 కోట్లు కేటాయించింది. ప్రాథమిక చేనేత కార్మిక సహకార సంఘాల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వల రిటైల్‌ విక్రయాలపై ప్రత్యేక రిబేట్‌ ఇచ్చేందుకుగాను రూ.8 కోట్లు కేటాయించింది. వడ్డీ రాయితీ, రిబేట్‌ స్కీం, పావలా వడ్డీ స్కీం కింద ప్రాథమిక చేనేత కార్మిక సహకార సంఘాలు, స్వయం సహాయక గ్రూపులు లబ్ధి పొందేందుకు రూ. 6 కోట్లు, విశా ఖపట్నం బ్రాండిక్‌‌స లంకలోని సమీకృత టెక్‌‌స టైల్‌ పార్కుల అభివృద్ధికి రూ. ఒక లక్ష వెచ్చించేలా ప్రణాళికలు రూపొం దించింది.


నెలాఖరులోగా రుణమాఫీ అమలు:


చేనేత రుణమాఫీ పథకం అమలుకు రాష్టప్రభ్రుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా రూ.110.96 కోట్లు మంజూరు చేసింది.  దీనిలో రూ.72 కోట్లను ఇప్పటికే చేనేత కార్మికుల ఖాతాల్లో ప్రభుత్వం జమ జేసింది. మిగిలిన మొత్తాన్ని ఈ నెలాఖరులోగా మిగిలిన చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించింది. రుణమాఫీ ద్వారా రాష్ర్ట వ్యాప్తంగా 25,567 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. తరవాత కూడా చేనేత కార్మికులకు కొత్త రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ర్ట చేనేత, జౌళి, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 


కార్మికుల కోసం 5 వేల షెడ్ల నిర్మాణం: చేనేత కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ర్ట వ్యాప్తంగా 5 వేల వర్‌‌క షెడ్ల  నిర్మించాలని భావిస్తోంది. ఒక్కో షెడ్‌ నిర్మాణానికి 75 వేల వ్యయమవుతోందని అంచనా వేస్తోంది. అలాగే మరో 25వేలమంది చేనేత పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 ఏళ్లు నించిన ప్రతి చేనేత కార్మికునికీ పింఛన్‌ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 75 వేల మందికి పింఛన్లు చెల్లిస్తోంది. కొత్తగా మరో 25 వేల మందికి పింఛన్లు చెల్లించాలని నిర్ణయించినట్లు రాష్ర్ట చేనేత, జౌళి, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దాదాపు లక్ష మందికి పెన్షన్లు అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com