ట్రెండింగ్
Epaper    English    தமிழ்

535 ఉద్యోగాలకు మరికొన్ని రోజులే గడువు..అప్లై ఇలా

national |  Suryaa Desk  | Published : Sat, Sep 25, 2021, 01:26 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) రిఫైనరీస్‌ విభాగం.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 513 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.


విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.


ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.


వేతనం: రూ.1,05,000


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు: రూ.150


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్‌ 21, 2021


దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 12, 2021


రాత పరీక్ష తేది: అక్టోబర్‌ 24, 2021


వెబ్‌సైట్‌:https://iocl.com/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com