ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్మాతో బెల్లీ ఫ్యాట్ తగ్గుదల

national |  Suryaa Desk  | Published : Fri, Sep 17, 2021, 02:46 PM

బెల్లీ ఫ్యాట్... ఆడవాళ్లను ఎక్కువగా వేధించే సమస్య. ఈ ప్యాట్ తగ్గించుకోవడానికి చాలామంది యోగా, వ్యాయామాలు ట్రై చేస్తుంటారు. కొందరు వేలకు, వేలకు ఖర్చు చేస్తారు. బెల్లీ ఫ్యాట్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే అందరూ దీనిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.


మారిన ఆహారపు అలవాట్లు, సమయాభావం, కల్తీ ఆహారం వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. వ్యాయామాలు చేయక శరీరంలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. దీంతో ఆస్పత్రులకు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.


ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అయితే ఆధునిక కాలంలో చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం ఉండటం లేదు. దీంతో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే వ్యాయామం చేయకుండా బెల్లీఫ్యాట్‌ తగ్గించుకోవాలంటే ఆహారంలో ఈ ఐదు రకాల మార్పులు చేసుకుంటే.. ఈజీగా బెల్లి ఫ్యాట్‌ను దూరం చేసుకోవచ్చు.


ఉదయమే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ప్రతిరోజు తాగాలి. కొద్ది రోజుల్లో, పొట్ట చుట్టూ మాత్రమే కాకుండా శరీరంలో అన్ని చోట్లా నిల్వ ఉన్న కొవ్వు కరగడం ప్రారంభమవుతుంది. బరువును నియంత్రించడానికి, కొవ్వు కరిగించడానికి అజ్వైన్ నీరు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో పాటు ఇది గ్యాస్, అజీర్ణం, అసిడిటీ మొదలైన సమస్యలను పరిష్కరిస్తుంది.


ఉదయం అల్పాహారం తీసుకోకపోతే చాలామంది బరువు తగ్గవచ్చని అనుకుంటారు కానీ ఇది తప్పు. బరువు తగ్గడానికి బదులు విపరీతంగా పెరుగుతారు. కాబట్టి ఉదయం పూర్తి అల్పాహారం తీసుకోండి. మొలకలు, ఉప్మా, ఇడ్లీ, మొదలైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంగా తీసుకోవాలి. పొట్ట, నడుము సన్నబడాలనుకుంటే గోధుమ రోటీకి కొంతకాలం మానేసి, దానికి బదులుగా బార్లీ, పప్పు పిండితో చేసిన రోటీలను తినాలి. ఆహారంలో పచ్చి కూరగాయలు, సలాడ్లు, జ్యుసి పండ్లను ఎక్కువగా తినాలి. కొన్ని రోజులు ఈ రూల్స్ పాటిస్తే.. బెల్లీఫ్యాట్‌ వేగంగా కరగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com