ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పు చేస్తూ దొరికిపోయిన కిలేడీ

national |  Suryaa Desk  | Published : Tue, Sep 14, 2021, 01:12 PM

ఓ బంగారం దుకాణంలో ఓ మహిళ చాకచక్యంగా గోల్డ్ రింగ్ దొంగతనం చేసింది. కానీ సీసీ కెమెరా ఆమెను పట్టించింది. ఈ ఘటన యూపీలోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని పుక్రయాన్ పట్టణంలోని జరిగింది. చోరీ చేసిన మహిళను చూస్తే ఆమె దొంగ అని ఎవరూ అనుకోరు. అంత పద్ధతిగా డ్రస్ చేసుకుని, చేతికి వాచ్ ధరించి బంగారు దుకాణానికి కస్టమర్‌లా వెళ్లింది. గోల్డ్ రింగ్స్ చూపించమని అడిగింది. ఆ షాపు యజమాని ఒక బాక్స్ తీసి పలు మోడల్స్ చూపించాడు. ఇంకా ఏమైనా మోడల్స్ ఉంటే చూపించడంటూ ఆమె అనడంతో షాపు యజమాని కిందకు వంగి వేరే బాక్స్ తీస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ఆమె ముందు ఉంచిన బాక్స్ నుంచి సెకన్ల వ్యవధిలో గోల్డ్ రింగ్‌ను దొంగతనం చేసింది. ఆ బాక్స్ ఎక్కువ సేపు తన ముందు ఉంటే రింగ్ మాయం చేసిందన్న విషయం తెలిసిపోతుందేమోనని తానే ఆ బాక్స్‌ మూసేసింది. యజమానికి కూడా అనుమానం రాలేదు.


తనకు నచ్చిన రింగ్స్ లేవంటూ ఆ మహిళ అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అయితే సీసీ కెమెరా దృశ్యాల్లో ఆ మహిళ దొంగతనం చేసినట్లు స్పష్టంగా రికార్డవడంతో యజమాని షాపు నుంచి వెళ్లిపోతున్న ఆ మహిళను రోడ్డుపై అడ్డగించాడు. తాను దొంగని కాదని దబాయించి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డవడంతో ఆమె దొరికిపోయింది. మహిళ కావడంతో షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. మహిళా కానిస్టేబుల్ సాయంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com