ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐ స్పెష‌ల్ స్కీమ్‌.. వారం రోజులే ఛాన్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 06, 2021, 03:39 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన "ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్స్‌" స్కీమ్‌ గడువు మ‌రో వారం రోజుల్లో ముగియ‌నుంది. దీనిలో 75 రోజులు, 75 వారాలు, 75 నెల‌ల కాల‌ప‌రిమితితో ట‌ర్మ్ డిపాజిట్ల‌ను స్వీక‌రిస్తారు. డిపాజిట‌ర్లు ఈ ప‌థ‌కం ద్వారా 15 బేసిస్ పాయింట్ల వరకు అద‌న‌పు వ‌డ్డీ ప్ర‌యోజ‌నాన్ని పొందవచ్చు. సెప్టెంబ‌రు 14 వ‌ర‌కు ఈ పథకం అమ‌ల్లో ఉంటుంది.


ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్స్ స్కీమ్ కింద సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ వ‌డ్డీ రేట్లు..


ప్లాటినం: 75 రోజులు - 3.95 శాతం


ప్లాటినం: 525 రోజులు - 5.10 శాతం


ప్లాటినం: 2250 రోజులు - 5.55 శాతం


ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్స్ స్కీమ్ కింద సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు అందిస్తున్న‌ వ‌డ్డీ రేట్లు..


ప్లాటినం: 75 రోజులు - 4.45 శాతం


ప్లాటినం: 525 రోజులు - 5.60 శాతం


ప్లాటినం: 2250 రోజులు - 6.20 శాతం (ఎస్‌బీఐ వియ్‌కేర్ స్కీమ్ కింద వ‌డ్డీ రేటు వ‌ర్తిస్తుంది)


అర్హ‌త‌..


- ఎన్ఆర్ఈ, ఎన్ఆర్ఓ ట‌ర్మ్ డిపాజిట్ల‌తో స‌హా రూ. 2 కోట్ల లోపు దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లను ఎస్‌బీఐ ప్లాటిన‌మ్ డిపాజిట్ స్కీమ్ కింద అనుమ‌తిస్తారు.


- ఎన్ఆర్ఈ డిపాజిట్స్ కేవలం 525 రోజులు, 2250 రోజులకు మాత్రమే వర్తిస్తాయి


- కొత్త డిపాజిట్స్‌తో పాటు రెన్యూవల్ చేసిన డిపాజిట్స్‌కి కూడా ఈ ప‌థ‌కం వర్తిస్తుంది.


- టర్మ్ లేదా స్పెషల్ టర్మ్ డిపాజిట్స్‌ కు మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది.


వ‌డ్డీ రేట్లు చెల్లింపు..


- ట‌ర్మ్ డిపాజిట్లు - నెల‌వారిగా/ త్రైమాసికంగా చెల్లిస్తారు.


- స్పెష‌ల్ ట‌ర్మ్ డిపాజిట్ల‌కు మెచ్యూరిటి తేదీకి చెల్లిస్తారు.


ఎస్‌బీఐ ఎఫ్‌డీ తాజా వ‌డ్డీ రేట్లు..


సాధార‌ణ వినియోగ‌దారులు చేసే 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 2.9 శాతం నుంచి 5.4 శాతం వ‌డ్డీని ఎస్‌బీఐ ఆఫ‌ర్ చేస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు 50 బేసిస్ పాయింట్లు(0.50శాతం) అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 8,2021 నుంచి అమ‌ల్లో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com