యాంకర్ ... మత్తు మందులు ఇప్పుడు ఈ పేరు రాష్ట్రంలోనే సంచలనంగా మారింది...సినీ వర్గాల నుంచి సంపన్నుల వరకూ మత్తు మందుల వ్యవహారం సవాల్ ఎదుర్కోవాల్పిన పరిస్ధితి...ఈ సమయంలో విశాఖలో మత్తుమందుతో సమానంగా నిషానిచ్చే కొడేన్ ఫాస్పేట్ కలిగిన సిరప్లు,ఎల్ పిల్ కిట్లు పట్టుబడ్డాయి...గుట్టుచప్పుడు కాకుండా హోల్ సేల్ గా విక్రయించే ముగ్గురు వ్యక్తుల్ని విశాఖ ఫోర్ట్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి 12,65,100 రూపాయులు విలువచేసే సదరు డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు..ఔషద నియంత్రణ విభాగం జరిపిన తనిఖీల్లో ఇది వెలుగు చూడ్డంతో పోలీసులు రంగప్రవేశం చేశారు..డాక్టర్ ప్రిస్ క్రిప్షన్ లేకుండా వీటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు..2012 వీరు ఇదేతరహా వ్యాపారం చేస్తున్నట్లు ఫోర్త్ టౌన్ సిఐ జి.సత్యనారాయణ తెలిపారు.