జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల ఉత్పత్తుల సంస్థ బీఎండబ్ల్యూ నుంచి ఓ కొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి వచ్చింది. బీఎండబ్ల్యూ ప్రముఖ మోడల్స్‌లో ఒకటైన 3 సిరీస్‌లో 320డీ ఎడిషన్ స్పోర్ట్‌ను నేడు విడుదల చేసింది. దీని ధర రూ. 38.60లక్షలు(ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు. కాగా.. ఈ కొత్త 320డీ కారును చెన్నైలోని బీఎండబ్ల్యూ ఇండియా ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంస్థకు చెందిన అందరు డీలర్ల వద్ద ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఇక కారు ఫీచర్ల విషయానికొస్తే.. 2 లీటర్ల ట్విన్ పవర్ 4-సిలిండర్టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 188 బీహెచ్పీ పవర్, 400ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. అంతేగాక డ్రైవింగ్ మోడ్‌లను కూడా ఎంపిక చేసుకునే సదుపాయం ఈ కార్లో ఉంటుంది. కంట్రోల్ స్విచ్ సాయంతో డ్రైవింగ్ కండిషన్‌ను బట్టి కంఫర్ట్, ఎకో ప్రో, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్లాంటి మోడ్‌లలోకి మార్చుకోవచ్చు.