ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు అథ్లెట్స్ మెడల్స్ ఎందుకు కోరుకుతారో తెలుసా?

international |  Suryaa Desk  | Published : Wed, Jul 28, 2021, 12:54 PM

కరోనా వైరస్ ప్రపంచంలో కల్లోలం సృష్టించకపోతే.. టోక్యో ఒలంపిక్స్ గత ఏడాది జరగాల్సి ఉంది. ఎన్నో సవాళ్ల మధ్య ప్రారంభమైన ఈ టోక్యో ఒలంపిక్స్ లో అనేక దేశాల క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగారు. 2020 ఒలంపిక్స్ 2021 లో జరుగుతున్నాయి. తమ దేశం తరపున ఆడే ప్రతి క్రీడాకారుడు.. తాను ఆడే ఆటలో విజయం సొతం చేసుకోవాలని.. పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతాడు.. విశ్వక్రీడల్లో విజయబావుటా ఎగరవేసి.. తమ దేశపు పతాకం వినువీధుల్లో ఎగరాలని ప్రతిదేశపు క్రీడాకారుడు కోరుకుంటాడు. చైనా మొదటి పసిడి గెలుచుకోవడంతో మొదలైన ఆటగాళ్ల పతకాల మోత మోడుతూనే ఉంది.


టోక్యోలో ఒలింపిక్స్ 2020 లోభాగంగా ఫస్ట్ గోల్డ్ మెడల్ అందుకున్న చైనా షూటర్ యాంగ్ కియాన్ నుంచి 20 ఏళ్ల కలను సాకారం చేస్తూ భారత కు తొలి పతాకాన్న్ని అందించిన మీరాబాయి చాను, సోమవారం స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించిన ఫిలిప్పిన్స్, బెర్ముడా అథ్లెట్ల వరకు అందరూ తమ అశయాలను నెరవేర్చుకున్నారు. అయితే పతకం అందుకున్న క్రీడాకారులు వాటిని నోటిలో పెట్టుకుని కోరుకుంటాడు.. అలా ఎందుకు అనే సందేహం చాలామందిలో ఉంది.. అయితే విజేతలు అలా మెడల్ కొరకడానికి కొన్ని కారణాలు ప్రచారంలో ఉన్నాయి. తాము అనుకున్న దానిలో విజయం సొంతం చేసుకున్నాం తమ లక్ష్యం నెరవేర్చుకున్నామని చెప్పడానికి గాను ఎప్పటినుంచో క్రీడాకారులు ఈ పద్దతిని అనుసరిస్తున్నారని తెలుస్తోంది.


 పతకాలు సాధించిన క్రీడాకారులు తమంతట తాముగా ఇటువంటి పోజ్ లివ్వరని, ఫొటో గ్రాఫర్ల కోరిక మేరకే క్రీడాకారులు తమ మెడల్స్ ను కొరుకుతూ చిరునవ్వులు చిందిస్తారని ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఒలింపిక్ హిస్టోరియన్స్ అధ్యక్షుడు డేవిడ్ వాలెషిన్స్కీ అభిప్రాయపడ్డారు. అయితే ఇలా క్రీడాకారులు మెడల్స్ ను కొరకడంపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. #UnitedByEmotion అనే హ్యాష్ ట్యాగ్‌ ను జత చేసి.. పతకాలను గెలుచుకున్న క్రీడాకారులు ఆ మెడల్స్ ను కోరుకుంటున్న ఫోటోలను షేర్ చేసి.. ఇవి తినే మెడల్స్ కావు.. ఈ విషయాన్నీ మేము అధికారికంగా ప్రకటిస్తున్నాం అని చెప్పారు. అంతేకాదు… ఈ పతకాలను తాము జపాన్ ప్రజలు విరాళంగా ఇచ్చిన ఎలక్ట్రానిక్ పరికరాలను రీసైకిల్ చేసిన తయారు చేశామని చెప్పారు. అందుకని ఇకనుంచైనా క్రీడాకారులు పతకాలను కొరకవద్దని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com