ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.81,000 జీతంతో పోస్ట్ ఆఫీసులో ఉద్యోగాలు

national |  Suryaa Desk  | Published : Thu, Jul 15, 2021, 02:16 PM

పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. అందులో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఇటీవల మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. పంజాబ్ పోస్టల్ సర్కిల్‌లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఆగస్ట్ 18 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు డీటెయిల్డ్ నోటిఫికేషన్ చదవాలి. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ లో నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు ఫామ్ ఉంటుంది. దరఖాస్తుల్ని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాల్సి ఉంటుంది.


మొత్తం ఖాళీలు- 57


పోస్టల్ అసిస్టెంట్- 45


సార్టింగ్ అసిస్టెంట్- 9


మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 3


దరఖాస్తు ప్రారంభం- 2021 జూలై 10


దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఆగస్ట్ 18


విద్యార్హతలు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్ పాస్ కావాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ, బోర్డు గుర్తింపు పొందిన కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి.


ఇతర అర్హతలు- ఆర్చరీ, బ్యాడ్మింటన్, హాకీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, క్యారమ్ లాంటి క్రీడల్లో రాణించినవారికే అవకాశం.


వయస్సు- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్లు.


వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.81,000, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.56,900.


అభ్యర్థులు ముందుగా https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.


అందులో కెరీర్స్ సెక్షన్‌లో జాబ్ నోటిఫికేషన్ ఉంటుంది.


నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా చదవాలి.


నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది.


అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేయాలి.


అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా అంటే 2021 ఆగస్ట్ 18 లోగా చేరేలా స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్టులో పంపాలి.


దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:


Assistant Director Postal Services (Recruitment),


Office of Chief Postmarter General,


Punjab Circle, Sector 17,


Sandesh Bhavan, Chandigarh- 160017.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com