ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 14, 2021, 04:31 PM

మగవాళ్ల మాటేమో గానీ.. మహిళల అందంలో జుట్టుదే కీలక పాత్ర. అందుకే మహిళలు.. అందమైన కురుల కోసం పరితపిస్తుంటారు. నల్లగా, ఒత్తుగా ఉండే జుట్టు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే రెగ్యులర్ జీవితంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే ఒత్తైనా జుట్టు సొంతమవుతుంది.


జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. ముందుగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తలగడ గలేబులను తరచూ మార్చుతూ ఉండాలి. ఎందుకంటే జుట్టుకు ఉండే నూనె, చుండ్రు వీటిపై పడటమే కాకుండా తిరిగి మళ్లీ తలలోకే చేరే అవకాశం ఉంటుంది.


తలస్నానం జుట్టును టవల్‌తో గట్టిగా దులపకూడదు. అలా చేస్తే వెంట్రుకలు రాలిపోతాయి. జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. ఇలా చేస్తే చిక్కులు పడిపోయి ఊడిపోతుంది. ప్రొటీన్లు ఉండే గుడ్డుతో అప్పుడప్పుడూ పూత వేసుకుంటూ ఉంటే జుట్టు చక్కగా పెరుగుతుంది. అలాగే కొబ్బరి, బాదం, జొజొబా లాంటి నూనెలతో మర్దనా చేసుకోవాలి. అప్పుడు మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది.


తలస్నానం చేసేటప్పుడు షాంపూ మాత్రమే సరిపోదు. కండిషనర్ వాడాల్సిందే. ఎందుకంటే చాలా రకాల షాంపూలు మీ జుట్టులోని తేమను లాగేస్తాయి. కాబట్టి జుట్టుకు పోషణ, తేమ అందాలంటే కండిషనర్‌ ఉండాలి. మాడు, వెంట్రుకలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలి. మాంసకృత్తులు, విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, పాలకూర, ఉసిరిలను తరచూ తీసుకోవాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com