ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాక్ డౌన్ దెబ్బకు అల్లాడుతున్న క్యాబ్ డ్రైవర్లు

national |  Suryaa Desk  | Published : Thu, May 20, 2021, 12:52 PM

కరోనా మహమ్మారి అన్ని రంగాలను ఆగం..ఆగం చేస్తోంది. కరోనా ఎంట్రీతోనే క్యాబ్ డ్రైవర్ల బతుకు బండికి బ్రేకులు పడగా.. ఇప్పుడు లాక్‌డౌన్‌తో వారి జీవితాలు పూర్తిగా రోడ్డునపడ్డాయి. తమ బండి చక్రం కదలకపోవడంతో.. ఫైనాన్స్ కంపెనీలకు కిస్తీలు కట్టలేక.. అటు కుటుంబాన్నీ సాదుకోలేక అల్లాడుతున్నారు క్యాబ్‌ డ్రైవర్లు. దీంతో తమను ఆదుకోవాలంటూ.. సర్కార్‌ను వేడుకుంటున్నారు.


కోవిడ్ మహమ్మారి ఎన్నో జీవితాలను ఆతలాకుతలం చేస్తోంది. గతేడాది కరోనా పుట్టింది మొదలు.. అన్నీ రంగాలను పట్టి పీడిస్తోంది. ఆయా రంగాలపై ఆధారపడ్డ కుటుంబాలను పీల్చిపిప్పిచేస్తోందీ వైరస్‌. కరోనా దెబ్బకు క్యాబ్‌లు ఆగిపోయాయి. దీంతో వాటిపై ఆదారపడ్డ కుటుంబాలు ఇప్పుడు ఉపాధి కరువైంది. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నరకు పైగా క్యాబ్‌లపై ఉపాధి పొందుతున్నారు. వీరందరి జీవితాలను కరోనా కకలావికలం చేసింది. ఓలా, ఊబర్, ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై ఆధారపడి బతుకుతున్న వారిని రోడ్డునపడేసింది.


 


లాక్‌డౌన్‌తో క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్‌ కంపనీల నుండే క్యాబ్‌ డ్రైవర్లకు ఉపాధి లభిస్తోంది. కరోనాతో ఫస్ట్ వేవ్ నుంచే సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ డ్యూటీస్ అమలు చేస్తూ వస్తున్నాయి. దీంతో అన్ని సాఫ్ట్‌వేర్ సంస్థలు తమ కంపెనీల్లో క్యాబ్‌లను తొలగించాయి. దీంతో ఆ క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయింది. క్యాబ్‌లు నడిపే వారిలో.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని సొంతంగా నడుపుకునే వారు ఎక్కువ. లాక్‌డౌన్‌తో క్యాబ్‌లు ఆగిపోవడంతో.. ఫైనాన్స్‌ కంపెనీలకు నెలవారీ కిస్తీలు కట్టలేకపోతున్నారు. దీనికి తోడు ఉపాధి కూడా లేకుండా పోవడంతో.. ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి.


లాక్‌డౌన్‌తో ఉన్న ఉపాధికి గండి పడటంతో.. క్యాబ్‌లపైనే ఆధారపడ్డ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున్న పడ్డాయి. బండి నడవకపోవడంతో.. వారి ఇల్లు గడవడమే కష్టంగా మారంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొందరు సొంత గ్రామాలకు వెళ్లిపోగా.. మిగిలిన వారు సర్కార్ ఏమైనా సాయం చేయకపోదా అని ఎదురుచుస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com