ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ

national |  Suryaa Desk  | Published : Sat, Apr 10, 2021, 12:32 PM

 పొట్టి ఫార్మాట్ సందడి షూరూ అయింది. నిన్న చెన్నై వేదికగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచింది. ఇక ఈరోజు రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. రెండు జట్లూ కూడా విజయంతో టోర్నీలో శుభారంభం చేయాలని చూస్తున్నాయి. ఒకవైపు సీనియర్ కెప్టెన్ ధోని కాగా.. మరోవైపు యువ ప్లేయర్ రిషబ్ పంత్ మొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.


ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ పోరులో ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం. ఢిల్లీ, చెన్నై బ్యాటింగ్ లైనప్ ఒకసారి పరిశీలిస్తే.. చెన్నైకి ఓపెనింగ్ జోడీ పెద్ద సమస్యగా మారితే.. ఢిల్లీకి బౌలింగ్ ప్రధాన సమస్య. రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్‌పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ రోజు మ్యాచ్‌లో నలుగురు కీలక ఆటగాళ్లు ఆడట్లేదని సమాచారం. ఢిల్లీ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు కరోనా సోకగా.. పేసర్లు రబాడా, నోర్తజే క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక చెన్నై బౌలర్ ఎంగిడికి కూడా క్వారంటైన్ గడువు పూర్తి కాలేదు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com