ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 23, 2021, 04:42 PM

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా అక్కడక్కడా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ సంచాలకులు తెలిపారు. ఇక, దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఉంటుందని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా అక్కడక్కడా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో తూర్పు / ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com