బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మీబాయి కథతో మణికర్ణిక- ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం కంగనా కత్తి యుద్ధాలలో శిక్షణ పొందింది. నటిగా ఇదే తన చివరి సినిమా కావడంతో ఈ మూవీపై చాలా కాన్సన్ ట్రేషన్ చేస్తుంది. ప్రస్తుతం మణికర్ణిక చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టు తెలుస్తుండగా, సహ నటుడు నిహర్ పాండేతో కంగనా కత్తి సాము చేసే సీన్ తెరకెక్కించాడు క్రిష్. అయితే ఈ సన్నివేశంలో కంగనాకు తృటిలో పెను ప్రమాదం తప్పిందని ఎముకకు దగ్గరగా కత్తి గుచ్చుకుందని వైద్యులు చెప్పినట్లు చిత్ర వర్గాలువెల్లడించాయి. కంగనా నుదుటికి 15 కుట్లు పడ్డాయి. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కంగనా కొద్ది రోజులు షూటింగ్ కి దూరం కానుంది. కత్తి ఫైటింగ్ కోసం డూప్ వాడుదామని చిత్ర నిర్మాతలు కంగనాకి చెప్పినప్పటికి , ససేమీరా అని షూట్ లో పాల్గొందట. అయితే ఈ సీన్ కోసం కంగనా ఎన్నో సార్లు రిహర్సల్స్ చేసినప్పటికి, చివరికి ఇలా జరిగిందని కమల్ జైన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే కంగనా త్వరలో ఫిలిం మేకర్ గా తన సత్తా నిరూపించుకోవాలని ఉవ్విళ్ళూరుతుంది. క్రిష్ సినిమా పూర్తైన వెంటనే పూర్థి స్తాయి కామెడీ చిత్రాన్ని తాను తెరకెక్కించనున్నట్టు కంగనా ఇటీవల తెలిపింది.