ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాట్స్ మన్..

international |  Suryaa Desk  | Published : Wed, Feb 17, 2021, 12:44 PM

టెస్ట్‌ క్రికెట్‌కు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెస్సి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్లు డుప్లెస్సి సౌతాఫ్రికా తరఫున 69 టెస్టుల్లో ఆడాడు. 2012 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో తొలి టెస్ట్ ఆడిన డుప్లెస్సి..తన చివరి టెస్టును ఈ మధ్యే రావల్పిండిలో పాకిస్థాన్‌పై ఆడాడు. అయితే ఈ సిరీస్‌లో అతను మొత్తం విఫలమయ్యాడు. 10,23, 17, 5 స్కోర్లు మాత్రమే చేశాడు. దీంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని తన మనసు చెప్తోందని ఇన్ స్టాగ్రామ్ లో తెలిపాడు.
టెస్టుల నుంచి రిటైరైన తర్వాత తాను టీ20లపై దృష్టి సారించనున్నట్లు డుప్లెస్సి స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఇండియాలో, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఈ ఫార్మాట్లో ప్రపంచంలో జరిగే అన్ని లీగ్‌లలో ఆడుతూ.. వరల్డ్‌కప్‌కు సిద్ధం కావాలని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. సౌతాఫ్రికా తరఫున 69 టెస్టులు ఆడిన డుప్లెస్సి 4,163 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కెరీర్‌లో అతని అత్యధిక స్కోరు 199. గతేడాది డిసెంబర్‌లో శ్రీలంకపై ఈ స్కోరు సాధించాడు.
సౌతాప్రికా టీమ్‌ను 36 టెస్టుల్లో లీడ్ చేసిన డుప్లెస్సి 18 మ్యాచ్‌ల విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. వన్డేల్లోనూ తాను ఆడతానని చెప్పిన డుప్లెస్సి.. టీ20లే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. 2019లో వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా టీమ్ కెప్టెన్‌గా ఉన్న డుప్లెస్సి.. ఆ టోర్నీలో టీమ్ విఫలమవడంతో తొలగించారు. ఆ తర్వాత 2020, ఫిబ్రవరిలో టెస్ట్‌, టీ20 టీమ్‌లకు కూడా కెప్టెన్‌గా తప్పుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com