ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిటాల ఫ్యామిలీలో ఫుల్ జోష్.. శ్రీరామ్ కి డబుల్ ప్రమోషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 06, 2020, 02:22 PM

అనంతపురం రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు పరిటాల రవి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పరిటాల రవి పేరు అందరికీ తెలిసిందే. అయనకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు. అలాంటి పరిటాల రవి కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి. రవి ప్రథమ కుమారుడు పరిటాల శ్రీరామ్ తండ్రి అయ్యాడు. పరిటాల శ్రీరామ్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన కమిటీలో పరిటాల శ్రీరామ్ కి కీలక పదవి దక్కింది. ఏపీ టీడీపీ అధికార ప్రతినిధిగా పరిటాల శ్రీరామ్ ను నియమించారు. ఇదే సమయంలో పరిటాల కుటుంబంలో మరో తరానికి వారసుడు వచ్చాడు. అటు తండ్రిగా, ఇటు పార్టీలో కీలక పదవులతో శ్రీరామ్‌కు డబుల్ ప్రమోషన్ దక్కిందని తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ఇంట సంబరాలు మొదలయ్యాయి. పరిటాల రవి మళ్లీ పుట్టాడు అంటూ సంబరపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com