ట్రెండింగ్
Epaper    English    தமிழ்

14 హత్యలు చేశా..నన్ను శిక్షించండి.. నిందితుడి వింత ఆవేదన

international |  Suryaa Desk  | Published : Tue, Nov 03, 2020, 04:21 PM

ఎవరైనా హత్య చేసినా..నేరం చేసినా కంటి నిండా నిద్రపోరు. ఎప్పుడెప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారా అని క్షణం క్షణం భయంతో బతుకుతుంటారు. అలాంటిది 14 మందిని హత్య చేశాడు. 30 ఏళ్లుగా 14 మందిని హత్య చేసిన ఆ వ్యక్తి ధైర్యంగా బయట తిరుగుతున్నాడు. తాను నేరం చేశానని అంగీకరించినా పోలీసులు శిక్షించడం లేదని నిందితుడు చెప్తున్నారు. ఈ ఆసక్తికర ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. లీ చున్ ఇన్నేళ్లు తనను పోలీసులు పట్టుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని నిందితుడు చెప్తున్నాడు.
దక్షిణ కొరియాకు చెందిన లీ చున్ జేకి ప్రస్తుతం 57ఏళ్లు. తాను మెుత్తం 14 మందిని హత్య చేశానని తనను శిక్షించాలని దక్షిణ కొరియాలోని సువాన్ నగరంలోని కోర్టుకు తెలిపాడు. తాను మొత్తం 14మందిని హత్య చేసినట్టు గతేడాది మొదటిసారి అతడు చెప్పాడు. దక్షిణ కొరియా చట్టాలు అనుమానితులు, నేరస్థుల ప్రైవసీ హక్కుకు రక్షణ కల్పిస్తాయి. అందువల్ల నేరస్థుడి పూర్తి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినందుకు నిందితుడికి గతంలో జీవితకాల శిక్ష పడింది. కానీ 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తరువాత, 2008లో అతడు పెరోల్‌పై బయటకు వచ్చాడు.
1986 నుంచి 1991 మధ్య హ్వాసెంగ్ ప్రాంతంలో అతడు మొత్తం 10 హత్యలు చేశాడు. ఈ వరుస హత్యలను అక్కడి ప్రజలు హ్వాసెంగ్ మర్డర్స్ అని పిలుస్తారు. వీటితో కలిపి మొత్తం 14మందిని చంపినట్లు అతడు చెప్పాడు. కానీ ఈ హత్యలకు సంబంధించిన కేసులను పోలీసులు ఇంకా పరిష్కరించలేదు. ఈ సీరియల్ కిల్లింగ్స్‌పై 2003లో మెుమోరీస్ ఆఫ్ మర్డర్ పేరుతో ఒక సినిమా కూడా వచ్చిందంటే అవి ఎంత సంచలనం సృష్టించాయో చెప్పొచ్చు. 2019లో డీఎన్‌ఏ ఆధారాల సాయంతో పోలీసులు లీ చేసిన కొన్ని హత్యలపై దర్యాప్తును తిరిగి ప్రారంభించారు. అతడిపై విచారణ కొనసాగుతోంది. హత్యల గురించి పోలీసులు తనను ప్రశ్నించారని లీ సోమవారం తెలిపాడు.
తన చేతుల్లో హతమైన ఒక వ్యక్తి వాచ్‌ను ఇప్పటికీ తీసుకువెళ్తున్నానని అతడు చెప్పడం విశేషం. కానీ పోలీసులు మాత్రం తన ఐడెంటిఫికేషన్ గురించి ఆరా తీసి, ఆ తర్వాత వదిలేసినట్టు నిందితుడు చెప్తున్నాడు. పోలీసులు ఇంకా తాను చేసిన నేరాలను నిరూపించలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని లీ ఓ ప్రముఖ వార్తా సంస్థతో తెలిపాడు. హత్యల గురించి దాచడానికి నేను పెద్దగా ప్రయత్నించలేదు. అందువల్ల సులభంగా పోలీసులు నన్ను పట్టుకుంటారనుకున్నాను. ఇక్కడ వందలాది పోలీసు బలగాలు ఉన్నాయి. పోలీసులు నన్ను డిటెక్టివ్ ల వద్దకు తీసుకెళ్లారు. కానీ వారు నా చుట్టూ ఉన్న వ్యక్తుల గురించే ప్రతీసారి అడిగేవారు అని లీ చెప్పాడు. 13 ఏళ్ల బాలికను హత్య చేస్తున్నప్పుడు తాను ఎలాంటి భావోద్వేగాలకు గురికాలేదని అతడు చెప్పాడు. తాను చేసిన హత్యలపై అనుమానంతో ఒక దివ్యాంగుడిని అరెస్టు చేశారని ఎవరో చెబుతుంటే విన్నానని లీ తెలిపాడు. కానీ తాను చేసిన హత్యల్లో దేనికి సంబంధించి అతడిని అరెస్టు చేశారో తెలియదని లీ ప్రకటించాడు. ఇప్పటికైనా అతడు హత్యలు చేసినట్టు పోలీసులు కోర్టులో నిరూపిస్తారో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com