ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రాగాల మూడు రోజులు భారీ వర్ష సూచన..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 29, 2020, 04:04 PM

రాగల మూడు రోజుల వరకు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. అటు దక్షిణ కోస్తా ఆంధ్రలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఉరుములు మెరుపులుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు రాయలసీమలో ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com