ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్తగా కారు కొనే వారికి బంపరాఫర్.. ఏకంగా రూ.40,000 తగ్గింపు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 25, 2020, 06:36 PM

కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. కారు ధర భారీగా తగ్గింది. ప్రముఖ దేశీ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా తన కారు ధరలో కోత విధించింది. ఏకంగా రూ.40,000 వరకు తగ్గించేసింది.టాటా మోటార్స్ తన అల్ట్రోజ్ కారు ధరను ఏకంగా రూ.40 వేలు తగ్గించేసింది. బీఎస్ 4, బీఎస్ 6 వేరియంట్ల మధ్య ధర వ్యత్యాసం ఎక్కువగా లేకుండా ఉండేందుకు, అలాగే పండుగ సీజన్‌లో అమ్మకాలు పెంచుకోవాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ ఈ కారుపై ధరను తగ్గించేసింది.టాటా అల్ట్రోజ్ కారులో దాదాపు 5 వేరియంట్లు ఉన్నాయి. అల్ట్రోజ్ ఎక్స్ఈ, అల్ట్రోజ్ ఎక్స్‌ఎం, అల్ట్రోజ్ ఎక్స్‌టీ, అల్ట్రోజ్ ఎక్స్‌జెడ్, అల్ట్రోజ్ ఎక్స్‌జెడ్ఓ అనేవి వేరియంట్లు. వీటి ధర రూ.6.99 నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ధర రూ.8.95 లక్షలుగా ఉంది. బీఎస్ 4, బీఎస్ 6 వేరియంట్ల మధ్య ధర వ్యత్యాసం ఇప్పుడు రూ.40 వేలుగా ఉంది.పండుగ సీజన్‌లో కొత్తగా కారు కొనుగోలు చేయాలని యోచించే వారికి ఇది అదిరిపోయే బంపరాఫర్ అని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ కంపెనీ అంటే ప్రజల్లో నాణ్యత విషయం గుర్తుకు వస్తుంది. ఈ కారు కూడా తన విభాగంలో దుమ్మురేపుతోంది. ప్రస్తుతం ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యా్క్ కారు కేవలం డీజిల్ వేరియంట్ల రూపంలో మాత్రమే అందుబాటులో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com