ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 4 న యుపిఎస్ సి ప్రిలిమ్స్ పరీక్షలు : డి.ఆర్.ఓ. మురళి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 07:20 PM

అక్టోబర్ 4న యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతి నందు 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని కోవిడ్ నిబంధనలు, యు. పి. ఎస్. సి. గైడ్ లైన్స్ లను అభ్యర్థులు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు తు.చా తప్పకుండా పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో, పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లతో డిఆర్ఓ సమావేశమై పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా చేపట్టవలసిన విధులపై సంభందిత అధికారులకు వివరించారు.ఈ సంధర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ అక్టోబర్ 4న తిరుపతి కేంద్రంగా 14 పరీక్షా కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ కు హాజరు కానున్నారని ఇప్పటికే హాల్ టికెట్ లు, పరీక్షా సమయం, కేంద్రాలలో పాటించాల్సిన నిబందనలు అభ్యర్థులకు అందాయని సూచించారు. కోవిడ్ కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సానిటేషన్, మాస్కూలు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు.అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఎలెక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. అక్టోబర్ 1 న మరో మారు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం ఉంటుందని సూచించారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు వ్రాయనున్నారని, అర్థ గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజీలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు.


పరీక్షా కేంద్రాల ఐడీల వివరాలు :


50001 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- ఎ) - 576 మంది అభ్యర్థులు, 50002 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50003 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల (వింగ్- ఎ) – 576 మంది అభ్యర్థులు, 50004 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50005 – శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల, బాలాజీ కాలనీ – 480 మంది అభ్యర్థులు, 50006 – ఎస్వీ యునివర్సిటి క్యాంపస్ హైస్కూల్ – 480 మంది అభ్యర్థులు, 50008 – ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ – 576 మంది అభ్యర్థులు, 50015 – శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం – 576 మంది అభ్యర్థులు, 50007- ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ – 576 మంది అభ్యర్థులు, 50009 –శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్ -576 మంది అభ్యర్థులు, 50025- కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ – 384 మంది అభ్యర్థులు, 50011- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ -ఎ) – 480 మంది అభ్యర్థులు, 50012- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీ (వింగ్- బి ) – 343 మంది అభ్యర్థులు , 50013- ఎస్వీ హైస్కూల్ – 27 మంది అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నారు.ఈ సమీక్షలో వెన్యూ సూపర్వైజర్లు ప్రకాష్ బాబు, సులోచనారాణి, మహాదేవమ్మ, బద్రమణి,పద్మావతమ్మ, వెంకటేశ్వర రాజు, కూల్లాయమ్మ , సావిత్రి , కృష్ణమూర్తి , శ్రీనివాసుల రెడ్డి, మధుసూధన రావు, ముణిరత్నం నాయుడు, సి. సూపర్ నెంట్ వాసుదేవ , డిటిలు లక్ష్మినారాయణ, అధికారులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com