ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ ఇంజనీర్ల దినోత్సవశుభాకాంక్షలు : మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 15, 2020, 12:03 PM

  దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర అమోఘమని దేశ సమగ్రాభివృద్ధి లో ఇంజనీర్ ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. మంగళవారం భారతదేశం ప్రముఖ ఇంజినీర్ రాజనీతిజ్ఞడు  భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘాన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ ప్రతి ఏటా విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్ల దినోత్సవాన్ని జరుపుకుంటునట్లు తెలిపారు. దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్రను మరువలేనిదన్నారు.  1861 సెప్టెంబర్ 15 న కర్ణాటక ముద్దెనహళ్లి లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారన్నారు. చదువుల్లో రాణిస్తూ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో  డిగ్రీ పూర్తిచేసిన ఆయన 1885లో బొంబాయ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగాలు సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్ గా నాసిక్, ధూలే పుణే లో ఉద్యోగంలో చేరారన్నారు. సివిల్ ఇంజనీర్ గా, ఆర్థికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యాం నిర్మాతగా,స్టేట్ మెన్ గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి విశ్వేశ్వరయ్య దేశాభివృద్ధికి బీజాలు వేశారన్నారు. 1912 నుండి 1918 వరకు 19వ మైసూర్ దీవాన్'గా విధులు నిర్వహించి మైసూరు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది 'ఫాదర్ ఆఫ్ మాడ్రన్ మైసూర్'గా పేరొందారని చెప్పారు. ఆసియాలోని అతి పెద్ద కృష్ణ రాజ సాగర్ డ్యామ్ ను మైసూర్ లో నిర్మించారని అన్నారు. 1909లో హైదరాబాద్ వరద ప్రమాదాన్ని ఎదుర్కొన్న దళాల ప్రత్యేక కన్సల్టెంట్ ఇంజనీరుగా నేటి మహానగరానికి మూసీ నది వరద నియంత్రణ వ్యవస్థలో భాగంగా హుసేన్ సాగర్ డ్యామ్ తో పాటు అనేక సివిల్ నిర్మాణాలకు ఆద్యుడైనారు. విశాఖపట్టణం సముద్ర కోతకు గురికాకుండా ఇంజనీరింగ్ ప్రతిభ ప్రదర్శించారని తెలిపారు.తిరుపతి తిరుమల రోడ్డు నిర్మాణానికి అమూల్య సూచనలు ఇచ్చారని కొనియాడారు. ఇంజినీర్ల కు గుర్తింపు తెచ్చిన మహా ప్రతిబాశాలి అన్నారు.నీటిపారుదలలో సరికొత్త 'బ్లాక్ సిస్టమ్' ప్రవేశపెటీ, 1903లో పుణే వద్ద కడక్ వాస్లా డాం కు మొదటిసారి ఆటోమాటిక్ గేట్లు, ఫ్లడ్ గేట్లు అమర్చిన ఘనత ఆయనదే అన్నారు.1955లో ఖారత అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' పొందిన  విశ్వేశ్వరయ్య కింగ్ జార్జి వి చేత నైట్ ఫుడ్' స్వీకరించి 'సర్ గౌరవ బిరుదు అందుకున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com