ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెన్త్, ఇంటర్‌తోనే మహిళలకు మంచి అవకాశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 08:17 PM

మన దేశంలో చాలామంది ఆడవాళ్లు మధ్యలో చదువు మానేస్తూ ఉంటారు. దానికి రకరకాల కారణాలున్నాయి. దీంతో కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేరు. టెన్త్‌తోనో.. ఇంటర్‌తోనే ఆపేస్తారు. అలాంటి వాళ్లు ఏ మాత్రం నిరాశ పడకనక్కర్లేదు. ఆర్థికంగా స్థిరపడేందుకు అలాంటి వాళ్లకు కూడా మంచి అవకాశాలున్నాయి. కెరీర్‌ను బిల్డ్ చేసుకునేందుకు మార్గాలున్నాయి. చేయదగిన జాబ్స్‌ను ఎంచుకుని ఏ మాత్రం భయపడకుండా ముందుకువెళ్లొచ్చు.


ఇన్సూరెన్స్ జాబ్స్


టెన్త్ మాత్రమే చేసి మానేసినవాళ్లకు ఇన్సూరెన్స్ జాబ్స్ బెస్ట్ చాయిస్. దీనికోసం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లే మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఓ చిన్న టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత వాళ్లే ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా నియమించుకుంటారు. దీంతో ఇంటి నుంచే ఇన్సూరెన్స్ పాలసీలు చేయిస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు.


ఆన్‌లైన్ టీచింగ్


కోవిడ్ పుణ్యమా అని అన్ని ఆన్‌లైన్ అయిపోయాయి. ఆన్‌లైన్ టీచింగ్ అనేది ఇప్పుడు డిమాండ్ ఉన్న జాబ్. పిల్లలు ఇప్పుడు స్కూల్స్‌కు వెళ్లే అవకాశం లేదు. అలాంటి లోయర్ క్లాస్ చిన్న పిల్లలకు ఆన్‌లైన్‌లో టీచింగ్ చేయవచ్చు. దీనికోసం రకరకాల వెబ్‌సైట్లు ఉన్నాయి. వాటి ద్వారా ఇలాంటి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వొచ్చు.


ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో జాబ్స్


ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జాయిన్ అవ్వడానికి టెన్త్ కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ అవసరం ఉండదు. ఇది చాలా సులభమైన అవకాశం. టెన్త్ ‌తో ఆపేసిన వాళ్లకు ఇది మంచి కెరీర్ ఆప్షన్. అయితే ఈ కోవిడ్ సమయంలో ఇది కొంచెం రిస్కీ జాబ్ అని చెప్పుకోవచ్చు.


రిసెప్షనిస్ట్...


కేవలం టెన్త్, ఇంటర్ మాత్రమే చేసి ఉంటే.. చిన్న చిన్న రెస్టారెంట్లలో, హోటల్స్ రిసెప్షనిస్ట్‌లుగా చేరవచ్చు. ఈ ఉద్యోగాలకు మృదు స్వభావం, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. మంచి పార్ట్ టైమ్ జాబ్‌‌గా కూడా దీనిని ఎంచుకోవచ్చు.


ఎయిర్‌ పోర్టుల్లో గ్రౌండ్ స్టాఫ్


ఎయిర్‌ పోర్టుల్లో గ్రౌండ్ స్టాఫ్‌గా జాయిన్ అవడానికి ఎటువంటి టెన్త్ కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం ఉండదు. కాకపోతే ఈ జాబ్స్‌లో షిప్ట్‌లు ఉంటాయి. కొంచెం ఒత్తిడితో కూడుకున్న జాబ్. కానీ ఎప్పుడు ఈ జాబ్స్‌కు డిమాండ్ ఉంటుంది.


ఈవెంట్ మేనేజ్‌మెంట్ జాబ్స్


ఈవెంట్ మేనేజ్‌మెంట్‌‌‌లో జాబ్స్‌కు ఎటువంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. కేవలం మంచి స్వభావం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు. స్టూడెంట్స్‌కు ఇది మంచి ఛాన్స్. మీటింగ్స్, సెలబ్రిటీలను కలవడం వంటివి ఇష్టమైనవాళ్లకు ఇది మంచి ఆప్షన్.


క్రియేటివ్ జాబ్స్


ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా.. ఫర్వాలేదు. సింగింగ్, డ్యాన్సింగ్, యాక్టింగ్, పెయింటింగ్స్ వేయడం వంటి టాలెంట్స్ ఉంటే.. అదే మీకు అవకాశం అవుతుంది. ఇలాంటి ప్రతిభావంతులకు మంచి అవకాశాలున్నాయి ఇవేకాదు యోగా టీచర్లుగా, ఇంతకు ముందు స్పోర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంటే దాని ఆధారంగా కూడా ఉద్యోగాలు సంపాదింవచ్చు. హౌస్ వైఫ్‌లైనా, చిన్న వయస్సులో ఉన్నవాళ్లైనా, ఎంత పెద్దవాళ్లైనా... ఇలాంటి అవకాశాలను పట్టుకుని ఆర్థికంగా స్థిరపడొచ్చు.మన చుట్టూ చాలామంది మహిళలు ఆర్థిక భరోసా కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇలాంటి అవకాశాల గురించి తెలియదు. ఈ విషయం షేర్ చేయడం వల్ల అలాంటి వాళ్లకు ఉపయోగపడుతుంది. వీలైనంత ఎక్కువగా ఈ విషయాన్ని షేర్ చేసి తెలియజేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com