కడప జిల్లా: పులివెందులలో దారుణం జరిగింది...అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఓ వ్యక్తి బరితెగించాడు.ఏకంగా ఎస్సైనే వాహనంతో ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఎస్సై తృటిలో తప్పించుకుని...నిందితుడిని అరెస్టు చేశారు. కారులో మద్యం అక్రమంగా రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై గోపినాథ్ రెడ్డి శుక్రవారం పులివెందులలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అటువైపుగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ఎస్సై ప్రయత్నించారు. అయితే కారును నడుపుతున్న వ్యక్తి...వాహనాన్ని నిలపకుండా ఎస్సైని ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకెళ్లాడు..*
ఎస్సై చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారు అద్దాలను పగలగొట్టి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఆ కారును, అందులోని 80 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు..దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.