ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నెన్ని అద్భుతాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 25, 2020, 12:28 PM

ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప్ర‌వీణ్ అంగుస్వామి షేర్‌ చేసిన సీతాకోకచిలుకకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బయటకు ఎండిపోయిన ఆకులా కనపడుతోన్న ఈ సీతాకోక చిలుక ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగురంగుల‌తో కనపడుతూ అలరిస్తోంది. తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది.


దీంతో అది ఒక ఆకుగా భావించి ఇతర పక్షులు దానికి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయి. తన ఈ సీతాకోకచిలుక తనను తాను రక్షించుకుంటోంది. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నెన్ని అద్భుతాలు ఉంటాయో ఈ వీడియోను చూస్తే తెలుస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆసియాలోనే ఓ ప్రాంతంలో ఈ సీతాకోకచిలుక వీడియోను పరిశోధకులు తీశారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com