ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన జగన్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 12, 2020, 06:12 PM

ఇరిగేషన్‌శాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్ట్‌ల వివరాలను జగన్‌ తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల ప్రగతిపై, ఈ ఏడాది ప్రారంభించనున్న ప్రాజెక్ట్‌ల గురించి అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ పనులు, సహాయ పునరావాస కార్యక్రమాలపై జగన్‌ ఆరా తీశారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com