ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమార్తెను కడతేర్చిన కసాయి తండ్రి...

national |  Suryaa Desk  | Published : Sat, Aug 08, 2020, 02:23 PM

తన కుమార్తె స్నేహితుడిని ప్రేమిస్తుందనే కోపంతో ఆమెను చంపిన కసాయి తండ్రి బాగోతం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ నగరంలో వెలుగుచూసింది. రాజ్ కోట్ నగరంలోని గాంధీగ్రామ్ ప్రాంతంలో గోపాల్ నకూం, అతని కుమార్తె ఇలా నివాసముంటున్నారు. తల్లి నెలక్రితం మరణించింది. తన కుమార్తె స్నేహితుడిని ప్రేమిస్తుందనే కోపంతో తండ్రి గోపాల్ కుమార్తెను హత్య చేశాడు. ఇటీవల ప్రియుడితో కలిసి కుమార్తె లేచి పోయిందని తండ్రి కుమార్తెతో గొడవ పడ్డాడు. అనంతరం తండ్రి గోపాల్ బ్యాట్ తీసుకొని కుమార్తె ఇలాను కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com