ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిక్ టాక్ చేస్తుంటే.. కుక్క కరిచింది!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 02:52 PM

టిక్‌టాక్ పిచ్చిలో ప‌డి అనేక మంది చుట్టు పక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. టిక్ టాక్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నవారు సైతం ఉన్నారు. కొందరైతే పార్కులు, రోడ్లు ఎక్క‌డ బ‌డితే అక్క‌డ టిక్‌టాక్‌లు చేస్తూ ఫేమ‌స్ అవ్వాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఒక అమ్మాయి త‌మ అపార్ట్‌మెంట్ ప్రాంగ‌ణంలో టిక్ టాక్ కోసం డ్యాన్స్ చేస్తోంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కుక్క ఒక‌సారిగా వ‌చ్చి అమ్మాయి తొడను కరిచింది. దీంతో అమ్మాయి భ‌య‌ప‌డి కుక్క‌ను వ‌దిలించుకొని పారిపోయింది. ఆ టిక్ టాక్ ఏమో కానీ కుక్క కరిచే వీడియో మాత్రం బాగా వైరల్ గా మారింది. కుక్క మంచి పని చేసింది. ఆ అమ్మాయికి తిక్క కుదిరిందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com