ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలితాలు(03-06-2020)

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 03, 2020, 12:55 PM

రాశి- మేషం: పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. వివాదాల్లో, కోర్టు కేసుల్లో విజయం, ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. స్నేహితుల నుంచి అనుకోని సాయం అందుతుంది. ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు అనుకూల ఫలితం ఉంటుంది.


రాశి- వృషభం: ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మిత్రుల నుంచి సహాయం ఆశిస్తున్నవారికి వారు అనుకున్న సాయం అందుతుంది. మీ పిల్లలకు సంబంధించి ఉన్నత విద్యకు అవకాశాలు మెరుగవుతాయి. స్నేహితులతో ఉన్న వివాదాలను తొలగించుకోవడానికి అనుకూలమైన రోజు.


రాశి-మిధునం: పిల్లల విషయంలో శుభ పరిణామాలున్నాయి. కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. విద్యా సంబంధ వ్యవహారాలకు, భూ, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం. భూమి లేదా వాహనం కొనుగోలు చేయదలచిన వారు ఈ రోజు తీసుకోవచ్చు.


రాశి- కర్కాటకం: సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం మంచిది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.ప్రయాణం తలపెడతారు.


రాశి- సింహం: విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనులు అనుకున్న విధంగా కాకపోయే సరికి కొంత నిరాశకు లోనవుతారు. కొత్తవారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేనిచో అవమానాల పాలవుతారు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనడం కానీ, బాగు చేయించడం కానీ చేస్తారు.


రాశి- కన్య: కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మంచి ఆహారం తీసుకోవడం కానీ, నూతన వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేస్తారు. కొన్ని విషయాల్లో అత్యుత్సాహానికి పోకుండా ఉండడం మంచిది.


రాశి- తుల: కొత్త సమస్యలు ఎదురవుతాయి. చిన్న పనికి అయినా ఇతరులపై ఆధారపడడం కానీ, ఇతరుల సాయం తీసుకోవడం కానీ చేస్తారు. ఉద్యోగంలో అనుకోని సమస్య కారణంగా ఆందోళనకు గురవుతారు. అలాగే మిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశముంటుంది.


రాశి- వృశ్చికం : ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. గతంలో పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు గడిస్తారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండాలి.


రాశి- ధనస్సు :ఆత్మీయులకు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఉద్యోగంలో అనుకూల మార్పు ఉంటుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. మీ సంతానం కారణంగా మీరు ఆనందాన్ని, గుర్తింపును పొందుతారు. ఖర్చులు విపరీతం.


రాశి -మకరం: వ్యాపకాలు అధికమవుతాయి. ఒకే రకమైన జీవన విధానంలో కొంత మార్పు సాధించాలన్న ఆలోచన కలిగి ఉంటారు. అనుకోని ప్రయాణం కానీ, కొత్త వ్యక్తులను కలుసుకోవడం కానీ జరుగుతుంది. మానసికంగా ఏదో తెలియని అలజడిని, వెలితిని కలిగి ఉంటారు. అనవసర జోక్యం తగదు.


రాశి- కుంభం: సకాలంలో చెల్లింపులు జరుపుతారు. అనుకోని అవమానం కానీ, భయం కానీ ఎదురవుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కాదు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కూడా మీ ఆందోళనకు కారణం అవ్వొచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. 


రాశి- మీనం :గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ సృజనాత్మకతకు, ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com