తిరుమల శ్రీవారి సేవా టికెట్ల వెబ్ సైట్ ను అధికారులు మార్చారు. శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు ఆన్లైన్లో రిజర్వు చేసుకోవడానికి అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com అనే వెబ్ సైట్ ను ఇక నుంచి https:/tirupatibalaji.ap.gov.in గా అధికారులు మార్పు చేశారు. భక్తులు ఈ మార్పును గమనించాలని టీటీడీ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి ఆర్జిత సేవా టికెట్లు కావాలనుకునే వారు కొత్త వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపింది.