కొన్ని రోజులుగా టాలీవుడ్ అభిమానులనే కాక ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన ప్రశ్న కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది. దీనికి ఏప్రిల్ 28న సమాధానం దొరికింది. ఇక దీని తర్వాత మరో ప్రశ్న అక్కినేని ఫ్యాన్స్ మతులను తొలుస్తుంది. అదేమంటే మోస్ట్ లవబుల్ పెయిర్ అక్కినేని నాగ చైతన్య- సమంతల పెళ్ళెప్పుడు అని.. జనవరిలో ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట 2017 చివరిలో పెళ్ళి పీటలెక్కుతారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని అఖిల్ పెళ్లి క్యాన్సిల్ కావడంతో తేదీలు మారాయి. సమ్మర్ లో ఉంటుందని ప్రచారం జరిగింది. కాని ఈ రోజు సౌత్ ఫిలిం ఫేర్ అవార్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరైన చైతూ తన మ్యారేజ్ డేట్ అక్టోబర్ 6 అని అఫీషియల్ గా ప్రకటించాడు. అయితే వేదిక ఎక్కడ అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అభిమానులు మాత్రం గోవా వేదికగా వీరి వివాహం జరగనుందని అంటున్నారు. అయితే సమంత ఇప్పటికే తన పెళ్లి కోసం ప్రత్యేకమైన చీరలు తయారు చేయించుకుంటుందని తెలుస్తుండగా, చైతూ అభిమానులకు సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట.