ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఇక ఆన్‌లైన్‌ అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 12:46 AM

 -టౌన్‌ప్లానింగ్‌ అధికారుల, సిబ్బంది చేతివాటానికి చెక్‌


 -పారదర్శకంగా అనుమతులకు కమిషనర్‌ శ్రీకారం


 -నూటికి నూరు శాతం పనులు ఆన్‌లైన్‌ ద్వారానే


 -స్మార్‌‌టసిటీ కాన్సెఫ్‌‌టలో  భాగంగా ఈ+ఆఫీసు విధానం


 -త్వరలో పర్యావరణం, ఫైర్‌సేఫ్టీ, హెచ్‌ఎండీఏ శాఖలతో


హైదరాబాద్‌, సూర్యప్రతినిధి:  హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు నిలయమైన టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని పూర్తిగా పారద ర్శకంగా రూపొందించేందుకు జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ డాక్టర్‌ బి.జనార్థన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమా లపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలుమార్లు బహిరంగంగా పేర్కొన్న విషయం తెలిసిందే!. టౌన్‌ప్లానింగ్‌ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు గత ఏడాదికాలంగా కమీషనర్‌ జనార్థన్‌రెడ్డి అందివచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూనే ఉన్నారు. అయి నా కూడా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది ఇళ్ల నిర్మాణ అనుమతులు జారీ చేయడంలో..ఇసీ జారీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోప ణలు వ్యక్తంకావడంతో ఇక టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో చేతివాటకానికి పూర్తిగా స్వస్తిపలికి ఆన్‌లైన్‌ సేవలను అందించాలని కమీషనర్‌ నిర్ణయించారు. ఇందు లో భాగంగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఆన్‌లైన్‌ విధానం పరిపూ ర్ణంగా అమలుకానుంది. ఇంతకాలం వ్యక్తిగత నివాస భవనాలకు మాత్రమే పరి మితమైన ఆన్‌లైన్‌ విధానం ఇక వాణిజ్య, బహుళ అంతస్తులకు కూడా వర్తింపజే శారు. దీంతో టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి నూటికి నూరుశాతం పనులు ఆన్‌లైన్‌ ద్వారానే జరిగేలా అన్ని ఏర్పాట్లు్ల పూర్తిచేశారు. మెట్రో నగరాల్లో నూటికి నూరుశాతం ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్న వాటిలో ఢిల్లీ, ముంబ యి తరువాత మన నగరమే కావడం విశేషం.


వ్యక్తిగత గృహాల నిర్మాణ అనుమతులు: స్మార్‌‌టసిటీ కాన్సెఫ్‌‌టలో  భాగంగా ఈ-ఆఫీసు విధానాన్ని చేపట్టిన జీహెచ్‌ఎంసీ గతేడాది జూన్‌ 2వ తేదీ నుంచి వ్యక్తిగత గృహానిర్మాణ అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారా జారీ చేసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇది విజయవంతంగా కొన సాగుతుండడంతో నేటి నుంచి (20వ తేదీ) నుంచి వాణిజ్య, బహుళ అంతస్తులకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ఇది చేపడితే మొత్తం నూటికి నూరుశాతం టౌన్‌ప్లానింగ్‌లో ఆన్‌లైన్‌ విధానం అమలు చేసినట్లవుతుంది. గత జూన్‌ రెండో తేదీ నుంచి ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా గ్రేటర్‌ పరిధిలో 4,784 భవనాలకు అనుమతులు మంజూరు చేయగా, మరో 1,194 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు అధికా రులు తెలిపారు. అలాగే నిబంధనలకు అనుగుణంగాలేని 128 దరఖాస్తులను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా, రాష్ట్ర ప్రభుత్వం సైతం టౌన్‌ప్లానింగ్‌లో అవినీతి నిర్మూలన కోసం దరఖాస్తుదారులు అసలు కార్యా లయం మెట్టుకూడా ఎక్కకుండానే ఇంటికే అనుమతులు వచ్చేలా చూడాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే దశలవారీగా మొద లు వ్యక్తిగత గృహాలను చేపట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు తాజాగా అన్ని రకాల భవనాలకూ దీన్ని వర్తింపజేశారు. మలిదశలో ఇతర శాఖల నుంచి ఎన్‌ఓసీలు కూడా పొందే అవసరం లేకుండా సింగిల్‌ విండో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


త్వరలో ఇతర విభాగాలతో అనుసంధానం: ముఖ్యంగా వాణిజ్య భవనాలు, బహుళ అంతస్తుల అనుమతుల కోసం ఎయిర్‌పోర్టు అథారిటీ, ఫైర్‌సేఫ్టీ, రెవె న్యూ, భూ వినియోగం వివరాల కోసం హెచ్‌ఎండీఏ, పర్యావరణ శాఖ తదితర విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొందాల్సి ఉంటుంది. అవి తీసు కున్న తరువాతే జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. దరఖాస్తుదారులు ఇంటి దరఖాస్తుతో పాటు వీటిని కూడా జతచేసి ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అయితే రెవెన్యూ, ఎయిర్‌పోర్టు అథారిటీతో ఇప్పటికే జీహెచ ్‌ఎంసీ అనుసంధానం ఏర్పాటు చేసుకుంది. త్వరలో పర్యావరణం, ఫైర్‌సేఫ్టీ, హెచ్‌ఎండీఏ తదితర శాఖలతో కూడా అనుసంధానం ఏర్పాటు చేసుకుంటే దరఖాస్తుదారులు సింగిల్‌ విండో ద్వారానే దరఖాస్తు చేసుకునే ఆస్కారం కలుగు తోంది. త్వరలోనే ఈ మేరకు అన్ని శాఖలతో అనుసంధానం చేసుకోనున్నట్లు, దీనికి తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయని నగర ముఖ్య ప్రణాళికాధికారి దేవేందర్‌రెడ్డి తెలిపారు. దేశంలో ఢిల్లీ, ముంబయి తరువాత పరిపూర్ణంగా ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్న నగరం మనదేనని, ఈ విధానం వల్ల దరƒ ఖాస్తుదారులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తు తానికి ఆయా విభాగాల ఎన్‌ఓసీలు దరఖాస్తుదారులే సమర్పించాల్సి ఉంటుం దని ఆయన వివరించారు.


ఆర్కిటెక్‌‌టలకు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లకు అవగాహన: ఆన్‌లైన్‌ విధానం అమలులో కీలకపాత్ర పోషించే ఆర్కిటెƒ్‌‌టలు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లకు ఈనెల 20వ తేదీన జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణ యించారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తే సమస్యలు, సందేహాలను నివౄఎత్తి చేస్తారు. అంతేకాకుండా దరఖాస్తుదారుల సౌకర్యార్థం జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయాల్లో ఫెసిలిటేషన్‌ కేంద్రాలను కూడా త్వరలో ఏర్పాటుచేయాలని నిర్ణ యించారు. వీటి ఏర్పాటుతో ప్రైవేటు ఆర్కిటెƒ్‌‌టలతో పనిలేకుండా దరఖాస్తు దారులే స్వయంగా ఆయా ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తులు సమర్పించే అవకాశం కలుగుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com