ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓడిపోయే రాజ్యసభ ఎన్నికల్లో నన్ను పోటీ పెడుతున్నారనేది తప్పుడు వాదన: వర్ల రామయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2020, 12:25 PM

ఓడిపోయే రాజ్యసభ ఎన్నికల్లో నన్ను పోటీ పెడుతున్నారనేది తప్పుడు వాదన అని వర్ల రామయ్య తెలిపారు. గతంలో నాకు రాజ్యసభ ఇవ్వాలనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు అని అన్నారు. పోటీ చేస్తానని ఒక పొలిట్ బ్యూరో సభ్యుడిగానే ప్రతిపాదించా అని అన్నారు. ఎందుకు పోటీ చేస్తున్నామనే అంశంపై మా దగ్గర సమాధానం ఉంది. తండ్రిని చంపారు అన్న వారికీ జగన్ ఎంపీ సీటు ఎలా ఇచ్చారు? అని అయన ప్రశ్నించారు. నత్వానికి బదులుగా దళిత నేతకు వైసిపి అవకాశం ఎందుకు ఇవ్వలేదు అని వర్ల  అన్నారు. ఇద్దరు బిసిలకు వైసిపి రాజ్యసభ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com