ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 12, 2020, 05:13 PM

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ భేటి ముగిసింద. కేబినేట్ భేటిలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగనన్న విద్యాకానుక పథకం కింద ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, పుస్తకాలను అందించాలని నిర్ణయం
- స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం.
- సీపీఎస్ ర్యాలీలపై నమోదైన కేసుల రద్దుకు నిర్ణయం
- ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు.
- 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలకు అంగీకారం.
- మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 27 రోజుల నుంచి 20 రోజులకు కుదింపు.
- పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు నిర్ణయం.
- పది నుంచి 13 రోజుల లోపే పంచాయతీ ఎన్నికల పూర్తి. సర్పంచ్ స్థానికంగా ఉండేలా నిబంధన.
- స్థానిక ఎన్నికల సమయంలో అభ్యర్ది మందు లేదా నగదు పంచుతూ దొరికితే డిస్ క్వాలిఫై చేయాలని నిర్ణయం.
- నగదు,మద్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం.
- మార్చి 15లోగా స్థానిక,మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయం.
- మార్చి 15 తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com