జనసేన పార్టీకి సిబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురువారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా లక్ష్మీనారాయణ రాజీనామాపై టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ లో స్పందిస్తూ.. లక్ష్మీ నారాయణ గారూ ఎన్టీఆర్, ఎంజీఆర్ లాంటి వాళ్లే రాజకీయాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాలో నటించారు. పవన్ కల్యాణ్ ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తే రాష్ట్రానికొచ్చిన నష్టమేం లేదు.. కానీ రాజకీయ నాయకులు నిజ జీవితంలో నటిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అన్నారు.