ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో కాల్పులు

international |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 11:53 AM

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోలో మ్యూజిక్ క్లబ్‌ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇద్దరు స్పాన్సర్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే ఈ దారుణానికి కారణమైనట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com