ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర పర్యావరణశాఖ మంత్రిగా హర్షవర్ధన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 22, 2017, 03:38 PM

కేంద్ర పర్యావరణశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు  హర్షవర్ధన్ చేపట్టారు. ఆ శాఖ మంత్రిగా ఉన్న అనిల్‌ మాధవ్‌ దవే ఇటీవల మరణించడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్‌కు పర్యావరణ శాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నేడు బాధ్యతలు స్వీకరించిన హర్షవర్థన్‌ మాజీ మంత్రి, దివంగత అనిల్‌ దవే స్మారకార్థం ఆఫీస్‌ ప్రాంగణంలో మొక్క నాటారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రిగా పనిచేసిన అనిల్‌ దవే మే 18న గుండెపోటుతో కన్నుమూశారు. అయితే ఆయన మరణానంతరం ఎటువంటి విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, అవార్డులు ఇవ్వొద్దని దవే తన వీలునామాలో రాశారు. తన గుర్తుగా మొక్కను నాటితే ఎంతో సంతోషిస్తానన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com