ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తనభర్త భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ వచ్చిన పోలీసులకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చుక్కలు చూపించారు. ఓ హత్యాయత్నం కేసులో భార్గవ్‌రామ్ ప్రమేయం ఉందంటూ ఆతనిని అదుపులోనికి తీసుకునేందుకు ఆమె నివాసానికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులను భార్గవ్‌రామ్ అనుచరులు అడ్డుకోవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పోలీసులు అఖిల ప్రియను కలిసేందుకు ప్రయత్నించగా, ఆమె గేటు లోపలినుంచి వారితో మాట్లాడారు. సెర్చ్ వారెంట్ ఉందా? అది లేకుండా ఎలా వస్తారని? ఆమె వారిని నిలదీసినప్పుడు వారి మధ్య వాగ్వాదం జరిగింది.
కాగా పోలీసులు తమ పక్కింటి నుంచి తమ ఇంట్లోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించి, ఇంట్లో ని సామాన్లను కూడా ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించారని ఆగ్రహించారు. తమని ఇబ్బంది పెట్టేందుకే అధికర పార్టీని మెప్పించుకునేందుకు కర్నూలు జిల్లా పోలీసు సూపరెంటెం డెంట్ చట్ట విరుద్ధంగా ప్రవర్తించి తమపై కేసులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్‌లోని తమ ఇంటిపైకి వచ్చిన చేసిన దౌర్జన్యంపై, ఎస్పి హెచ్చరికలపై ఉన్న ఫుటేజ్‌లతో పోలీసులపై కేసు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.