ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్ గర్ల్' అని తిట్టినందుకు మహిళ ఆత్మహత్య .. 15 ఏళ్ళ తర్వాత తీర్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 20, 2019, 06:08 PM

'నువ్వో కాల్ గర్ల్' అన్న మాటలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా, ఆ కేసు పదిహేనేళ్ల పాటు ఓ కుటుంబాన్ని కోర్టు చుట్టూ తిప్పింది. చివరకు కేసును కొట్టేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితుడు ఓ ఉపాధ్యాయుడు కాగా, అతని తల్లిదండ్రులపైనా అభియోగాలు నమోదయ్యాయి. కేసును విచారించిన జస్టిస్ ఇందు మల్ హోత్రా, ఆర్ సుభాష్ రెడ్డిల ధర్మాసనం, కేవలం 'కాల్ గర్ల్' అని వ్యాఖ్యానించడమే వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు సరిపోదని ఈ సందర్భంగా న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కోపంలో ఆ మాటను వాడివుండవచ్చని, దాని వెనుక దురుద్దేశాలు ఉంటాయని భావించడం లేదని పేర్కొంది. గతంలో ఇదే తరహాలో ఓ కేసు వచ్చిందని, 'వెళ్లి చావు' అని భర్త తిట్టాడన్న మనస్తాపంతో భార్య ఆత్మహత్య చేసుకుందని, అప్పుడు కూడా ఇదే తరహా తీర్పు ఇచ్చామని న్యాయమూర్తులు గుర్తు చేశారు. తాజా కేసులో ఐపీసీలోని 306/34 సెక్షన్ నిందితులకు వర్తించదని స్పష్టం చేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com