ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రవాస భారతీయుడుకి నోబెల్ బహుమతి

national |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2019, 09:59 PM

అమర్థ్యాసేన్‌ తర్వాత నోబెల్‌ పొందిన భారతీయుడిగా అభిజిత్‌ బెనెర్జీ ఘనత సాదించారు.అమెరికాలోని మసాచూసెట్స్‌యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేస్తున్న అభిజిత్‌ బెనెర్జీ ఆర్థికశాస్త్రంలో హార్వార్డ్‌యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆర్థికశాస్త్రంలో విశేష సేవలని అందించినందుకు ఈ ఏడాదికి ముగ్గురికి నోబెల్ బహుమతి అందనుంది. రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ ఎంపిక చేసిన ముగ్గురిలో భారత్ నుండి అభిజిత్‌ బెనర్జీ ఉన్నాడు. ఇంకా పారిస్ కి చెందిన ఎస్తేర్‌ డుఫ్లో, అమెరికాకి చెందిన మైఖేల్‌ క్రెమేర్‌లు సంయుక్తంగా ఈ బహుమతికి ఎంపిక అయ్యారు. రెండు దశాబ్దాలగా ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి వీరు ముగ్గురు చేసిన రూపకల్పనకి ఈ బహుమతి వరించింది. ప్రపంచ పేదరికంతో పోరాడే సామర్థ్యాన్ని  వీరి ప్రయోగాత్మక విధానం పెంచింది అని రాయల్‌ స్వీడిష్‌ అకాడెమీ తెలిపింది. ప్రైజ్‌మనీగా 9మిలియన్ల డాలర్లను నోబెల్‌ కమిటీ నుండి ఈ ముగ్గురు అందుకొనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com