ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా మద్యం, నగదు స్వాధీనం

national |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2019, 12:56 PM

 హర్యానా శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీగా మద్యం వరదలై పారుతోంది. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోంది. మద్యం, నగదు పంపిణీపై పోలీసులు కొరడా ఝళిపించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ప్రారంభమైన తొలి 16 రోజుల్లోనే భారీ మొత్తంలో నగదు, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు. తాము 8.52 కోట్ల రూపాయిల విలువైన మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. గత మే నెలలో జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో కేవలం 1.52 కోట్ల రూపాయిల విలువైన మద్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం స్వాధీనం చేసుకున్నది ఐదు రెట్లు ఎక్కువగా ఉందని వారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com